Saturday, 18 July 2026
  • Home  
  • వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం
- తిరుపతి

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం వరదయ్యపాలెం: బస్టాండ్ వద్ద తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి) ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించాలని గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆలయ చైర్మెన్, విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొప్పన రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం లేకపోవడంతో భక్తులు ఎండ, వానలకు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల మనోభావాలను గుర్తించి గ్రామపెద్దల సహకారంతో నూతన ఆలయ నిర్మాణానికి బొప్పన రమేష్ చొరవ తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బొప్పన చంద్రబాబు @చిన్ని, బీజేపీ మండల అధ్యక్షుడు దిలీప్ రాయల్, టీడీపీ మహిళా నాయకురాలు మునిభూషణమ్మ, గ్రామ పెద్దలు పృధ్వీ భవరాజు, లక్ష్మయ్య, కల్లూరు బాలసుందరం, దొడ్డి మునికృష్ణయ్య, కాట్ కుమార్, సామ్రాట్, గుత్తి సురేష్, ఆలయ అర్చకులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 🙏 ఓం శ్రీ సిద్ధేశ్వర స్వామియే నమః 🙏 వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి) ఆలయ జీర్ణోద్ధరణ & నూతన నిర్మాణానికి గ్రామపెద్దల ఏకగ్రీవ నిర్ణయం ఆలయ చైర్మెన్: శ్రీ బొప్పన రమేష్ గారు విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భక్తులందరి సహకారం కోరుతున్నాము

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద సిద్ధేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి తీర్మానం

వరదయ్యపాలెం: బస్టాండ్ వద్ద తరతరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి) ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించాలని గ్రామపెద్దలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఆలయ చైర్మెన్, విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బొప్పన రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఆలయం లేకపోవడంతో భక్తులు ఎండ, వానలకు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల మనోభావాలను గుర్తించి గ్రామపెద్దల సహకారంతో నూతన ఆలయ నిర్మాణానికి బొప్పన రమేష్ చొరవ తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బొప్పన చంద్రబాబు @చిన్ని, బీజేపీ మండల అధ్యక్షుడు దిలీప్ రాయల్, టీడీపీ మహిళా నాయకురాలు మునిభూషణమ్మ, గ్రామ పెద్దలు పృధ్వీ భవరాజు, లక్ష్మయ్య, కల్లూరు బాలసుందరం, దొడ్డి మునికృష్ణయ్య, కాట్ కుమార్, సామ్రాట్, గుత్తి సురేష్, ఆలయ అర్చకులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

🙏 ఓం శ్రీ సిద్ధేశ్వర స్వామియే నమః 🙏

వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద కొలువైన
శ్రీ సిద్ధేశ్వర స్వామి (సిద్దులయ్య స్వామి)
ఆలయ జీర్ణోద్ధరణ & నూతన నిర్మాణానికి
గ్రామపెద్దల ఏకగ్రీవ నిర్ణయం

ఆలయ చైర్మెన్:
శ్రీ బొప్పన రమేష్ గారు
విశ్రాంత గ్రామీణ బ్యాంక్ మేనేజర్

భక్తులందరి సహకారం కోరుతున్నాము

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.