చెందోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యా సమగ్ర పంపిణీ,
విద్యార్థుల సమక్షంలో అత్యంత వైభవంగా ప్రశాంత్ జన్మదిన వేడుకలు,
ఒకటి నుంచి 10వ తరగతి వరకు పలకలు నోట్స్ లు మెటీరియల్ పంపిణీ,
పున్నమి న్యూస్ డి హరికృష్ణ (చెందోడు )కోట మండలం జూలై 17,
నెల్లూరు జిల్లా కోట మండలం చంద్రుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆ పాఠశాల విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థులకు విద్యా ప్రదాత ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల పేరిట ఏర్పాటు చేయన ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.
వాకాడు ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల్లో సమక్షంలో బర్త్డే కేకు చేసి విద్యార్థుల శుభాకాంక్షలు అందుకున్నారు.
అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
తదుపరి పాఠశాల లో విద్యను అభ్యసించే ఒకటే నుండి 10వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకు పలకాలు, నోట్, పెన్సిల్, పెన్నులు అందరికీ పంపిణీ చేశారు.
ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాకులు చేస్తున్న ఈ కార్యక్రమాలు నా బూతు నా భవిష్యత్తు అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి రవిబాబు అన్నారు.
ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది తెలియజేసి కేకును అందుకున్నారు. అందరికీ విద్యాసామాగ్రిని నిర్వాహకులు పంపిణీ చేశారు.
ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఎన్ ఎన్ యు వాకాడు డిపో నాయకులు ప్రశాంత్, ప్రధానోపాధ్యాయులు రవి, ఎం వెంకట్రావు, పి ఆదిశేషయ్య,వెంకటసుబ్బయ్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



