రాజన్న సిరిసిల్ల జులై 17 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గురువుగారు శ్రీ గంటెల వెంకటరమణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్నేని మాధవి–వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, అమ్మ అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారి సేవాభావాన్ని అభినందిస్తూ, చిట్నేని మాధవి–వెంకటేశ్వరరావు దంపతులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటిపల్లి శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్రావు, ఉపసర్పంచ్ భవిత–నవీన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, అమ్మ అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులు, కుర్ర సావిత్రి విజయ స్వరూప శంకరవ్వ పద్మ విద్యాసాగర్ రావు మరియు
గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


