బార్యా భర్తల మధ్య గొడవ..
భర్త తమ్ముడు హత్య..
మాచర్ల న్యూస్: నాలుగు నెలల క్రితం వివాహం చేసుకొని అప్పటినుండి తరచూ గొడవ పడుతున్న భార్యాభర్తల ఇరువర్గాలు పంచాయతీ మాట్లాడుకుంటున్న సందర్భంలో జరిగిన వివాదం ఘర్షణకు
దారితీసి ఒకరు హత్యకు గురైన ఘటన మాచర్ల మండలంలోని రేగులవరం తండా గ్రామం లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రేగులవరం తండా గ్రామానికి చెందిన వాంకుడావత్ భరత్ నాయక్ కు, వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా గ్రామానికి చెందిన రమావత్ అనూషకు నాలుగు నెలల క్రితం వివాహం అయింది. వివాహమైనప్పటినుండి వీరు హైదరాబాదులో ఉంటున్నారు. వీరి మధ్యలో తరచుగా చిన్న చిన్న గొడవ జరుగుతుండడంతో శనివారం హైదరాబాదు నుండి రేగులవరంతండా గ్రామానికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న అనూష తండ్రి అంజి నాయక్ సుమారు 15 మందితో కలిసి రేగులవరం తండా గ్రామానికి చేరుకున్నారు.అనూష తల్లిదండ్రులు
అల్లుడి ఇంటికి వెళ్ళకుండా వాళ్ళతో బజార్లోనే మాట్లాడుతుండంతో ఇక్కడ వద్దు ఇది భార్యాభర్తల గొడవ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని భరత్ నాయక్ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇంటికి వెళ్లి మాట్లాడేది
ఎందుకు అంటూ రెట్టించుకొని ఇరువర్గాలు గొడవకు దిగారు.ఈ ఘర్షణలో భరత్ నాయక్ తమ్ముడైన బర్మానాయక్ (23)పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Uploaded Video:

