ఆత్మకూరు, జూలై 15 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి , ఆత్మకూరు శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గురువారం (జూలై 16) సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామం, ఆత్మకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఉదయం 11:00 గంటలకు సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామంలో నిర్వహించే స్థానిక కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
అనంతరం సాయంత్రం 4:00 గంటలకు ఆత్మకూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సహాయం మంజూరైన పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
అలాగే, ఇటీవల ఎంపికైన 23 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు నియామక పత్రాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేయనున్నారు.
ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం, నెల్లూరు ఒక ప్రకటనలో వెల్లడించింది.


