శ్రీ కాళహస్తి, జులై 14, (పున్నమి న్యూస్): ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తన తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ఈ అభినందనలు పంపుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి చాగంటి వారు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. వారి అమృత ప్రవచనాలు సమాజానికి నైతిక విలువల దిశా నిర్దేశం చేస్తున్నాయని ప్రశంసించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహంతో చాగంటి కోటేశ్వరరావు గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తమ జ్ఞానబోధనలతో సమాజాన్ని మరింత సన్మార్గంలో నడిపించాలని తాను మనసారా ప్రార్థిస్తున్నట్లు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.

చాగంటి కోటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి