మాచర్ల రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహించిన సంధ్యారాణి అచ్చంపేటకు బదిలీ అయ్యారు..
ఆమె మాచర్ల పట్టణ ఎస్ఐగా ఏడాదిన్నర, అలాగే మాచర్ల రూరల్ ఎస్ఐగా మరో ఏడాదిన్నర పాటు విజయవంతంగా విధులు నిర్వహించారు.
పల్నాడు జిల్లా ఉన్నతాధికారులు ఆమెను అచ్చంపేటకు బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం మాచర్ల పట్టణ ఎస్ఐగా ఉన్న వెంకట్రావును మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎస్ఐగా అదనపు బాధ్యతలను అప్పగించారు.


