ఓటరు నమోదు ప్రత్యేక అవగాహన ప్రకటన
ప్రతి అర్హుడైన ఓటరు తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారమ్ పూర్తి చేయండి – జూలై 14 చివరి తేది
మన గ్రామంలోని ప్రతి కుటుంబ సభ్యునికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. ప్రతి కుటుంబంలోని అర్హులైన ఓటర్లు తమ ఓటర్ ఎన్యుమరేషన్ ఫారమ్ తప్పనిసరిగా పూర్తి చేసి సంబంధిత BLO లేదా BLA గారికి అందజేయాలి.
మీ వివరాలను నమోదు చేయకపోతే మీ ఓటు జాబితా నుండి తొలగించబడే అవకాశం ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ వివరాలను నమోదు చేయించండి.
మీకు మీ ఓటర్ వివరాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే, మీకు సమీపంలోని గ్రామ సచివాలయాన్ని సంప్రదించి అక్కడి సిబ్బంది సహాయంతో వివరాలు తెలుసుకోండి.
ఎన్యుమరేషన్ ఫారమ్ సమర్పించడానికి జూలై 14 చివరి తేదీ. కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి తేదీ కోసం వేచి ఉండకుండా ఈ రోజే మీ BLO లేదా BLA గారిని సంప్రదించి మీ ఓటు హక్కును భద్రపరచుకోండి.
ప్రతి కుటుంబానికి ఈ సమాచారాన్ని తెలియజేసి, ప్రతి అర్హుడైన ఓటరు తన ఓటును కాపాడుకునేలా సహకరించండి.
ఇట్లు,
కాకు మధుసూదన్ యాదవ్
సంగం


