జయశంకర్ భూపాలపల్లి జిల్లా
జులై 11 పున్నమి న్యూస్తె: లంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జూలై 5న భువనగిరిలో నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి భారీ సభలు నిర్వహిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పార్టీని గ్రామ గ్రామాన విస్తరించాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో 2028లో రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ప్రారంభించిన సర్జికల్ స్ట్రైక్ మరియు కౌంట్‌డౌన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ బీసీ ముఖ్యమంత్రి కాలేదని పేర్కొన్నారు. అందువల్ల రాజ్యాధికారం సాధించే దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్ చరణ్, వామినోజు రాజేందర్, సామల చంద్రశేఖర్, బుర్రి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు

రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జులై 11 పున్నమి న్యూస్తె: లంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ జూలై 5న భువనగిరిలో నిర్వహించిన రాజ్యాధికార సమరభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి భారీ సభలు నిర్వహిస్తామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పార్టీని గ్రామ గ్రామాన విస్తరించాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 2028లో రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ప్రారంభించిన సర్జికల్ స్ట్రైక్ మరియు కౌంట్‌డౌన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ బీసీ ముఖ్యమంత్రి కాలేదని పేర్కొన్నారు. అందువల్ల రాజ్యాధికారం సాధించే దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా ముందుకు సాగి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్ చరణ్, వామినోజు రాజేందర్, సామల చంద్రశేఖర్, బుర్రి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు

