నెల్లూరు పార్లమెంట్ జనసేన పార్టీ సమాచార సేకరణ కమీటీ ఆధ్వర్యంలో విజయవంతంగా పార్టీ పదవులు ఆశిస్తున్న వారి నుండి అప్లికేషన్స్ తీసుకునే కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో భాద్యతగా నిర్వహించిన కమిటీ సభ్యులతో ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. పవన్ కళ్యాణ్ మన మీద పెట్టిన భాద్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన ప్రతి సభ్యునికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఐటీ టీమ్ సపోర్ట్ చాలా కీలకమైనది. కష్టపడి పని చేసిన ఐటీ టీమ్ సభ్యులకు ఈ రోజు చిరు సన్మానం చేయటం చాలా ఆనందకరం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కొట్టే వెంకటేశ్వర్లు ఏర్పాటు చేశారు.









