Wednesday, 1 July 2026
  • Home  
  • తాటిపర్తిలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు…
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తాటిపర్తిలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు…

*స్టాక్ అక్రమాలు వెలుగులోకి..* *రూ.18.97 లక్షల విలువైన ఎరువులు సీజ్..* *రెండు దుకాణాలపై 6-ఏ కేసులు నమోదు…* పొదలకూరు మండలం తాటిపర్తిలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లు, డీబీటీ రికార్డులు, ఏపీఏఐఎంఎస్ వివరాలను పరిశీలించగా పలు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. చైతన్య ఫర్టిలైజర్స్ లో 34.60 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం గుర్తించి, వాటి విలువ రూ.9,84,190గా నిర్ధారించారు. అలాగే బాలాజీ ఫర్టిలైజర్స్ లో 76.515 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం బయటపడగా, రూ.9,13,090 విలువైన ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఈ రెండు దుకాణాల్లో కలిపి సుమారు రూ.18.97 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకొని, సంబంధిత నిర్వాహకులపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం 6-ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏవో వేణుగోపాల్, సీఐ సుభానీ, మండల వ్యవసాయ అధికారి వి ప్రతాప్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

*స్టాక్ అక్రమాలు వెలుగులోకి..*

*రూ.18.97 లక్షల విలువైన ఎరువులు సీజ్..*

*రెండు దుకాణాలపై 6-ఏ కేసులు నమోదు…*

పొదలకూరు మండలం తాటిపర్తిలోని ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్లు, డీబీటీ రికార్డులు, ఏపీఏఐఎంఎస్ వివరాలను పరిశీలించగా పలు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. చైతన్య ఫర్టిలైజర్స్ లో 34.60 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం గుర్తించి, వాటి విలువ రూ.9,84,190గా నిర్ధారించారు. అలాగే బాలాజీ ఫర్టిలైజర్స్ లో 76.515 టన్నుల ఎరువుల స్టాక్ వ్యత్యాసం బయటపడగా, రూ.9,13,090 విలువైన ఎరువులను అధికారులు సీజ్ చేశారు. ఈ రెండు దుకాణాల్లో కలిపి సుమారు రూ.18.97 లక్షల విలువైన ఎరువులను స్వాధీనం చేసుకొని, సంబంధిత నిర్వాహకులపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం 6-ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఏవో వేణుగోపాల్, సీఐ సుభానీ, మండల వ్యవసాయ అధికారి వి ప్రతాప్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.