Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి…సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి…సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు

వార్త ముఖ్యాంశాలు

  • పొదలకూరు పట్టణంలోని కాకాణి రమణారెడ్డి కాలనీలో సోమవారం కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు.
  • ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

పొదలకూరు పట్టణంలోని కాకాణి రమణారెడ్డి కాలనీలో సోమవారం కూటమి సర్పంచ్ అభ్యర్థి కాసా శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.vప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా, ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ప్రజల మద్దతుతో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని కాసా శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి విజయానికి సహకరించాలని ఆయన కోరారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *