పెన్షన్ల పంపిణీ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన తహసీల్దార్ పద్మజాకుమారి
ఆత్మకూరు, జూన్ 30: హరికిరణ్ (పున్నమి ప్రతినిధి)
ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసీల్దార్ పద్మజాకుమారి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తల సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ పద్మజాకుమారి మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. బుధవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండటంతో సచివాలయ సిబ్బంది ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యే నేపథ్యంలో, ఒక్కరోజు పాటు అంగన్వాడీ కార్యకర్తలు సర్వే కార్యక్రమానికి సహకరించాలని సూచించారు.ఎస్ఐఆర్ సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఆమె కోరారు. గతంలో బీఎల్వోలుగా పనిచేసిన అనుభవం అంగన్వాడీ కార్యకర్తలకు ఉందని, ఆ అనుభవంతో సర్వే ప్రక్రియ విజయవంతం అయ్యేలా సహకారం అందించాలని సూచించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలనా ప్రక్రియలు సక్రమంగా అమలు కావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని తహసీల్దార్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని అధికారులకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.



