అనకాపల్లి జిల్లా , జూన్ 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. బూత్‌ల వారీగా ఓటర్లను సరిచేయడం, ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు బూత్‌లలో ఉన్న కారణంగా అవసరమైన మార్పులు చేయడం వంటి పనులను బీఎల్ఓలు చేపడుతున్నారు.
ఈ ప్రక్రియలో సచివాలయంలో బీఎల్ఓలు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి ప్రజలకు ఫారాల నింపడం, వివరాల సరిచూచడం, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. బీఎల్ఏలు మరియు సచివాలయ సిబ్బంది కలిసి ప్రజలకు పూర్తి సహకారం అందిస్తున్నారు.
ప్రతి ఓటరు తన వివరాలను సరిచేసుకొని ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా అన్ని పార్టీల ప్రతినిధుల సహకారంతో కార్యక్రమం కొనసాగుతోంది. కిసాన్ మోర్చా అధ్యక్షులు శనంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో సచివాలయానికి వచ్చిన ప్రతి ఓటరుకు అవసరమైన సహాయం అందిస్తూ ఫారాలు నింపే పనిలో సహకారం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు, బీఎల్ఏలు, సచివాలయ సిబ్బంది, అన్ని పార్టీ ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


