శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు పూత పనుల సందర్భంగా బంగారం దుర్వినియోగం జరిగిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేరళ హైకోర్టుకు సమర్పించిన మధ్యంతర నివేదికలో అప్పటి ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) అధ్యక్షుడు సహా పలువురి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది. 2019లో ద్వారపాలక విగ్రహాలను బంగారు పూత కోసం చెన్నైకు తరలించే సమయంలో అవి బంగారంతో కాకుండా రాగి పలకలతో ఉన్నట్లు తప్పుడు వివరాలు నమోదు చేసి అసలు బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా కొత్త కేసు నమోదు చేసేందుకు హైకోర్టు సిట్‌కు అనుమతి ఇచ్చింది. తుది నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కూడా ఆదేశించింది.

శబరిమల బంగారం దుర్వినియోగం కేసు.. కుట్ర జరిగినట్లు సిట్ మధ్యంతర నివేదిక