ఐదుగురు నిందితుల అరెస్టు – జైల్లోనే దొంగతనాలకు పక్కా ప్రణాళికలు
తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా,జూన్ 29 (పున్నమి ప్రతినిధి):
తాళ్లపూడి మండలంలో ఇటీవల సంచలనం సృష్టించిన దేవాలయాల హుండీ చోరీలు, ద్విచక్ర వాహనాల అపహరణ కేసుల్లో అరెస్టైన నిందితుల వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాళ్లపూడి ఎస్సై కె. రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో నిందితులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు అనపర్తికి చెందినవారు కాగా, మరొకరు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతంలో వీరు వేర్వేరు చోరీ కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన సమయంలో ఒకరికొకరు పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. జైలులోనే దొంగతనాలకు సంబంధించిన మెళకువలు, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే విధానాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తేలింది.
శిక్షా కాలం పూర్తయిన అనంతరం విడుదలైన ఈ ముగ్గురు మళ్లీ కలుసుకుని, ధర్మవరం, పెద్దేవం గ్రామాలకు చెందిన మరో ఇద్దరిని తమతో కలుపుకుని ఐదుగురు సభ్యులతో ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం తాళ్లపూడి మండలాన్నే లక్ష్యంగా చేసుకుని దేవాలయాల హుండీలను పగులగొట్టి నగదు అపహరించడం, నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఎస్సై కె. రామకృష్ణ పక్కా నిఘా, సాంకేతిక ఆధారాలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని వారి ఆటకు తెరదించారు. “పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితమైంది” అని ఎస్సై పేర్కొన్నారు.
జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపించినా, కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఎస్సై విజ్ఞప్తి చేశారు.
అరెస్టైన నిందితులను రిమాండ్కు తరలించినట్లు, వారి గత నేరచరిత్రపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు అరెస్టు కావడంతో తాళ్లపూడి మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాళ్లపూడిలో వరుస దేవాలయ హుండీ చోరీలు, బైక్ దొంగతనాల కేసు ఛేదించిన పోలీసులు
ఐదుగురు నిందితుల అరెస్టు – జైల్లోనే దొంగతనాలకు పక్కా ప్రణాళికలు తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లా,జూన్ 29 (పున్నమి ప్రతినిధి): తాళ్లపూడి మండలంలో ఇటీవల సంచలనం సృష్టించిన దేవాలయాల హుండీ చోరీలు, ద్విచక్ర వాహనాల అపహరణ కేసుల్లో అరెస్టైన నిందితుల వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాళ్లపూడి ఎస్సై కె. రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో నిందితులు పలు కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు అనపర్తికి చెందినవారు కాగా, మరొకరు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గతంలో వీరు వేర్వేరు చోరీ కేసుల్లో జైలుశిక్ష అనుభవించిన సమయంలో ఒకరికొకరు పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. జైలులోనే దొంగతనాలకు సంబంధించిన మెళకువలు, పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే విధానాలపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తేలింది. శిక్షా కాలం పూర్తయిన అనంతరం విడుదలైన ఈ ముగ్గురు మళ్లీ కలుసుకుని, ధర్మవరం, పెద్దేవం గ్రామాలకు చెందిన మరో ఇద్దరిని తమతో కలుపుకుని ఐదుగురు సభ్యులతో ముఠాగా ఏర్పడ్డారు. అనంతరం తాళ్లపూడి మండలాన్నే లక్ష్యంగా చేసుకుని దేవాలయాల హుండీలను పగులగొట్టి నగదు అపహరించడం, నిర్మానుష్య ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎస్సై కె. రామకృష్ణ పక్కా నిఘా, సాంకేతిక ఆధారాలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని వారి ఆటకు తెరదించారు. “పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితమైంది” అని ఎస్సై పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు కనిపించినా, కొత్త వ్యక్తుల కదలికలపై అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఎస్సై విజ్ఞప్తి చేశారు. అరెస్టైన నిందితులను రిమాండ్కు తరలించినట్లు, వారి గత నేరచరిత్రపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులు అరెస్టు కావడంతో తాళ్లపూడి మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

