ఎర్పేడు, జూన్ 29, (పున్నమి న్యూస్) : ఎర్పేడు మండలంలోని అంజిమేడు గ్రామంలో ఉన్న శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కళాశాలలో విద్యార్థుల్లో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పెంపొందించేందుకు సోమవారం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిత్యాదేవి ఆధ్వర్యంలో “మాదకద్రవ్యాలు–గంజాయి ముప్పు” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, సమాజంపై కలిగే తీవ్ర దుష్పరిణామాలతో పాటు యువత భవిష్యత్తుపై వాటి ప్రభావాన్ని విద్యార్థులు తమ ప్రసంగాలు, వ్యాసాల ద్వారా విశ్లేషించారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలనకు చట్టపరమైన చర్యలతో పాటు సమాజం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. యువతలో మాదకద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించి, సామాజిక బాధ్యతను పెంచే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆదర్శప్రాయంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిత్యాదేవి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థుల్లో చైతన్యం