Tuesday, 30 June 2026
  • Home  
  • తల్లి,తండ్రులకు పిల్లల ఆరోగ్యమే ప్రదానం .. పోలియో చుక్కలు తప్పనిసరి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

తల్లి,తండ్రులకు పిల్లల ఆరోగ్యమే ప్రదానం .. పోలియో చుక్కలు తప్పనిసరి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జూన్ 28, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో ఉచిత చుక్కల మందు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఊరందూరు సచివాలయంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన పలువురు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి, తల్లిదండ్రులకు వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…. భారత్ పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందినప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాల్లో పోలియో ఇంకా కొనసాగుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి ప్రతిసారీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా మాత్రమే సంపూర్ణ రక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని తల్లిదండ్రులందరూ బాధ్యతగా సమీప పోలియో కేంద్రాలకు చిన్నారులను తీసుకువచ్చి ఉచిత పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.