Sunday, 28 June 2026
  • Home  
  • “పల్స్ పోలియో విజయవంతం.. చిన్నారుల ఆరోగ్య రక్షణకు ఏటికొప్పాక ఏకమైంది!”
- అనకాపల్లి

“పల్స్ పోలియో విజయవంతం.. చిన్నారుల ఆరోగ్య రక్షణకు ఏటికొప్పాక ఏకమైంది!”

ఎలమంచిలి: జూన్ 28 | (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) : ఏటికొప్పాక గ్రామంలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను గ్రామపంచాయతీ, నడి వీధి రామాలయం, MPP School కేంద్రాల్లో విజయవంతంగా వేశారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నివారణకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, జనసేన మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబుజ్జి, వైస్ MPP నాగిరెడ్డి అచ్చియ్య నాయుడు, సర్పంచ్ కుమారుడు శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, రావి చలపతి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే Medical Officer D.N.M. సుగుణ, CHO S. అమ్మాజీ, CHO K. కృష్ణవేణి, ANM లక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామస్తులు విశేషంగా స్పందించి తమ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమం విజయవంతమైంది. “ప్రతి చిన్నారికి పల్స్ పోలియో – పోలియో రహిత సమాజమే మన లక్ష్యం” అని నాయకులు, వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు.

ఎలమంచిలి: జూన్ 28 | (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) :
ఏటికొప్పాక గ్రామంలో ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను గ్రామపంచాయతీ, నడి వీధి రామాలయం, MPP School కేంద్రాల్లో విజయవంతంగా వేశారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నివారణకు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, జనసేన మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్ అన్నం బాబుజ్జి, వైస్ MPP నాగిరెడ్డి అచ్చియ్య నాయుడు, సర్పంచ్ కుమారుడు శ్రీను, గొంతుమూర్తి కొండయ్య నాయుడు, రావి చలపతి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
అలాగే Medical Officer D.N.M. సుగుణ, CHO S. అమ్మాజీ, CHO K. కృష్ణవేణి, ANM లక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
గ్రామస్తులు విశేషంగా స్పందించి తమ చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమం విజయవంతమైంది. “ప్రతి చిన్నారికి పల్స్ పోలియో – పోలియో రహిత సమాజమే మన లక్ష్యం” అని నాయకులు, వైద్య సిబ్బంది పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.