విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.10,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బకాయిల కారణంగా విద్యార్థులు సర్టిఫికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేకపోతే విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కళాశాల నూతన కమిటీని కూడా నియమించారు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి ఏఐఎస్‌ఏ హెచ్చరిక