శ్రీకాళహస్తి మండలం తొట్టంబేడు గ్రామ హరిజనవాడ ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇళ్లపై నుంచి వెళ్తున్న ప్రమాదకర 11 కేవీ విద్యుత్ లైన్ కారణంగా ఏ క్షణమైనా ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొనగా, గతంలో ఇదే లైన్ కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించింది. దీంతో ఆ లైన్‌ను తొలగించాలని గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతూ వచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టేలా చేశారు. దీంతో శనివారం అధికారులు జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో ప్రమాదకర 11 కేవీ విద్యుత్ లైన్‌ను పూర్తిగా తొలగించారు. ఈ పనులను మండల పార్టీ అధ్యక్షుడు రావెళ్ల మునిరాజు నాయుడు, ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మనీ, తంగెళ్లపాలెం సింగిల్ విండో సహకార బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, నాయకుడు చందు తదితరులు పర్యవేక్షించారు.

20 ఏళ్ల విద్యుత్ భయానికి తెర.. తొట్టంబేడులో 11 కేవీ లైన్ తొలగింపు