శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు వంకాయల సిద్దులయ్య స్థానికంగా నిర్మించబోతున్న అయ్యప్ప స్వామి దేవాలయ గర్భాలయ నిర్మాణానికి రూ. 1,20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆలయంలోని అత్యంత ముఖ్యమైన కట్టడమైన గర్భాలయ నిర్మాణ పనుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. దాత సిద్దులయ్య ఉదారతపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, వంకాయల సిద్దులయ్య కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని శబరిమల అయ్యప్ప స్వామి తత్వమసి సేవాసమితి కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

అయ్యప్ప గర్భాలయ నిర్మాణానికి రూ. 1.20 లక్షల విరాళం