Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్‌లో భరోసా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేయనున్న భరోసా సెంటర్‌కు పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క) గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు, నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ గారు ,డీ ఐ జీ డాక్టర్ ఎల్ ఎస్ చౌహాన్ గారు, ఎస్పీ పాటిల్ సంగ్రామ్‌సింగ్ గారుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహిళలు, చిన్నారులకు రక్షణ, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, వారికి అవసరమైన వైద్య, న్యాయ, మానసిక పరమైన సేవలను సమన్వయంతో అందించడంలో భరోసా సెంటర్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
మహిళల భద్రత, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమాజంలో మహిళలు, చిన్నారులు ధైర్యంగా జీవించే వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర ,వైస్ చైర్మన్ బాదం రమేష్,టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు ,స్థానిక కౌన్సిలర్స్ ,ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *