దుత్తలూరు మండలం లోని బ్రహ్మేశ్వరంగ్రామ ప్రాథమిక పాఠశాలలో MEO-1 ఎస్.కె. ఫజుల్ అలీ , MEO-2 ఎన్. వెంగయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రీనా మేడం సమక్షంలో పూర్వ విద్యార్థి అందె రామయ్య ఈరోజు విద్యార్థులకు విద్యాసామగ్రి, పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా అందె రామయ్య మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తాను చదివిన పాఠశాలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు చేజర్ల పెంచల రెడ్డి, చిలకపాటి నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ ఈసా మంజు, వైస్ చైర్మన్ మారెళ్ల మౌనిక, గోళ్ళ రమాదేవి, పూర్వ విద్యార్థి హజరత్ బాబు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అదేవిధంగా, విద్యార్థులకు పుస్తకాలు, విద్యాసామగ్రిని అందించి విద్యాభివృద్ధికి తన వంతు సేవలను అందిస్తున్న దాత అందె రామయ్యను MEO-1 ఎస్.కె. ఫజుల్ అలీ , MEO-2 ఎన్. వెంగయ్య శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, పుస్తకాలు మరియు విద్యాసామగ్రిని అందించిన అందె రామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ కార్యక్రమం – బ్రహ్మేశ్వరం
దుత్తలూరు మండలం లోని బ్రహ్మేశ్వరంగ్రామ ప్రాథమిక పాఠశాలలో MEO-1 ఎస్.కె. ఫజుల్ అలీ , MEO-2 ఎన్. వెంగయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రీనా మేడం సమక్షంలో పూర్వ విద్యార్థి అందె రామయ్య ఈరోజు విద్యార్థులకు విద్యాసామగ్రి, పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అందె రామయ్య మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తాను చదివిన పాఠశాలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు చేజర్ల పెంచల రెడ్డి, చిలకపాటి నరసింహులు, ఎస్ఎంసీ చైర్మన్ ఈసా మంజు, వైస్ చైర్మన్ మారెళ్ల మౌనిక, గోళ్ళ రమాదేవి, పూర్వ విద్యార్థి హజరత్ బాబు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా, విద్యార్థులకు పుస్తకాలు, విద్యాసామగ్రిని అందించి విద్యాభివృద్ధికి తన వంతు సేవలను అందిస్తున్న దాత అందె రామయ్యను MEO-1 ఎస్.కె. ఫజుల్ అలీ , MEO-2 ఎన్. వెంగయ్య శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, పాఠశాల అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, పుస్తకాలు మరియు విద్యాసామగ్రిని అందించిన అందె రామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

