జలదంకి మండలం కమ్మపాలెంలో భూ వివాదంలో మృతి చెందిన వెలిగండ్ల రమేష్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు. రమేష్ చెల్లి బొబ్బ రజిత అక్రమంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకుని కుటుంబానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. రమేష్ మృతి ఈ వివాదంతో కలిగిన మానసిక వేదన కారణంగానే జరిగిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనపై రజిత చేస్తున్న ఆరోపణలు నిరాధారమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రమేష్ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను కోరారు.
Uploaded Video:



