Sunday, 14 June 2026
  • Home  
  • *సైబర్ పంజా…కల్యాణ మండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యం*
- క్రైమ్

*సైబర్ పంజా…కల్యాణ మండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యం*

*సైబర్ పంజా…కల్యాణ మండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యం* *భారీ స్థాయిలో ఎగ్జిబిషన్లు ఉన్నాయని ఎర* *అడ్వాన్స్ పంపిస్తున్నానంటూ కమీషన్ కోసం బేరాలు* *ఫోన్ పే ద్వారా నగదు వేయించుకుని పలువురికి కుచ్చుటోపీ…* *ఎమ్మెల్యేల పీఏల పేర్లు ఉపయోగించుకొని మోసం* *గత మూడు రోజులుగా జిల్లాలో సాగుతున్న సైబర్ దందా వెలుగులోకి..* *నాకు జైలు కొత్త కాదు… ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్* గుడివాడ: సైబర్ నేరగాళ్లు పందామార్చారు. కల్యాణమండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యంగా మోసాలకు పథక రచన చేశారు. భారీ స్థాయిలో ఫక్షన్లు ఉన్నాయని, కల్యాణ మండపం అద్దెకు కావాలని, క్యాటరింగ్ కాంట్రాక్టు ఇప్పిస్తామని, అడ్వాన్గా నగదు చెల్లిస్తున్నాం అంటూ వారి వద్ద నుంచి కమీషన్ల రూపంలో భారీగా నగదు కొట్టేశారు. గత మూడు రోజులుగా సాగుతున్న ఈ దందా శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… స్థానిక సత్యనారాయణపురంలోని ఐ.ఎం.ఏ.హాల్లో బెనారస్ చీరల భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందంటూ గుడివాడ ఎమ్మెల్యే పీఏ శశి చెప్పినట్లు హాల్ మేనేజరు శరత్కుమార్ అనే వ్యక్తి 9398053148 నంబర్ నుంచి ఫోన్ చేశాడు. అతని వద్ద పట్టణంలోని ఇద్దరు ప్రముఖ క్యాటరింగ్ ఏజెన్సీల వివరాలను సేకరించాడు. వారిని ఫోన్లో సంప్రదించాడు. తొలుత రోజుకు 500 మందికి భోజనాలు (వెజ్, నాన్వెజ్), స్నాక్స్ ఏర్పాటు చేయాలని,ఎంతమొత్తం అవుతుందంటూ ఆరా తీశాడు. వారితో సంప్రదించే సమయంలో కల్యాణ మండపం మేనేజర్ , పీఏ శశి పేర్లను వాడుకున్నాడు. అడ్వాన్స్ చెల్లిస్తానంటూ నమ్మకంగా మాట్లాడి వారిని బుట్టలో వేసుకున్నాడు. వారి ఫోన్పే నెంబర్లు తీసుకుని తొలుత వారికి రూ.1 పంపించాడు. దీంతో పాటు రూ.1.50 లక్షలు నగదును చేతిలో పట్టుకున్న ఫొటోను వారికి వాట్సప్ కు పంపించాడు. ఆ తర్వాత తిరిగి వారికి ఫోన్ చేసి జీఎస్టి సమస్య అడ్డుగా వస్తోందంటూ మాటల్లో పెట్టి, తాను కాంట్రాక్టును ఇప్పిస్తానని, తనకు రావలసిన కమీషన్ ను వెంటనే పంపాలని, అడ్వాన్స్ నగదును వెంటనే మీ ఖాతాలోకి జమచేస్తానని నమ్మించాడు. దీంతో వారు విడతల వారీగా నగదును సైబర్ నేరగాడు సూచించిన ఫోన్పే నెంబర్లకు బదిలీ చేశారు. లక్షలాది రూపాయలు వేరు వేరు ఖాతాల్లోకి జమ అయ్యాయి.తప్పించుకున్న ఇద్దరు క్యాటరింగ్ నిర్వాహకులు గుడ్లవల్లేరుకు చెందిన క్యాటరింగ్ నిర్వాహకుడికి ఫోన్ చేసి యథావిథిగా కథను చెప్పి నమ్మబ లికేందుకు విశ్వప్రయత్నం చేశాడు. తనకు కమీషన్ నగదు చెల్లిస్తే రూ.1.50లక్షలు అడ్వాన్స్ నగదును పంపిస్తానంటూ, డబ్బుల కట్టల ఫొటోను పంపించాడు. రెండో శనివారం బ్యాంకులకు శెలవు కావడంతో ఆయనకు అనుమానం వచ్చి నగదు చెల్లించేందుకు నిరాకరించాడు. దీంతో సైబర్ నేరం బారిన పడకుండా తప్పించుకు న్నాడు. కైకలూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలంటు సీఎన్ఆర్ గార్డెన్స్ అనువుగా ఉంటుందంటూ కైకలూరు ఎమ్మెల్యే పీఏ ధనుంజయ్ తమకు చెప్పినట్లు నమ్మించి కల్యాణ మండపం మేనేజరుకు ఫోన్ చేశాడు. కైకలూరులో క్యాటరింగ్ ఎవరు బాగా చేస్తారంటూ ఆరా తీశాడు. కైకలూరులోని ఓ క్యాటరింగ్ నిర్వాహకుడిని సంప్రదించి యథావిథిగా కథను చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో జాక్పాట్ తగిలిందంటూ సదరు క్యాటరింగ్ నిర్వాహకుడు వెంటనే తన సమీప బంధువు, గుడ్లవల్లేరుకు చెందిన క్యాటరింగ్ నిర్వాహకుడికి ఫోన్ చేసి భోజనం ప్లేటుకు ఎంత తీసుకోవాలో అని సంప్రదించాడు దీంతో విషయం అర్థం చేసుకున్న సదరు క్యాటరింగ్ నిర్వాహకుడు నాకు కూడా ఇటువంటి ఫోన్ కాల్ వచ్చిందని, ఇదంతా మోసం అంటూ వివరించాడు. దీంతో కైకలూరు క్యాటరింగ్ నిర్వాహకుడు కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించిన వ్యక్తికి ఫోన్ చేసి నేరుగా కలుస్తానని చెప్పాడు. తాను గుడివాడలో ఉన్నట్లు సైబర్ నేరగాడు శరత్కుమార్ చెప్పడంతో తాను కూడా గుడివాడలో ఉన్నానని, నేరుగా కలిసేందుకు వస్తున్నానంటూ ఫోన్లో తెలిపాడు. దీంతో శరత్ కుమార్ ఫోన్ చేయడం, లిఫ్ట్ చేయడం మానేశాడు. కాగా, సైబర్ మోస గాడి వలో చిక్కి ఎంతమంది నగదు పోగొట్టుకు న్నారో తెలియాల్సి ఉంది. *నాకు జైలు కొత్త కాదంటూ బెదిరింపులు…* విషయం తెలుసుకున్న శశి.. ఆ వ్యక్తికి కాల్ చేసి ఇదేంటని ప్రశ్నించారు. వెంటనే రూ.25 వేలు పంపితే మీ నియోజకవర్గంలో ఈ ఫోన్ కాల్స్ ఆగు తాయి, లేదంటే చేతనైంది చేసుకో.. నాకు జైలు కొత్త కాదు అని ఆ ఆగంతుకుడు దురుసుగా సమా దానం చెప్పాడు. దీంతో ఈ వ్యవహారంపై గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రజలను, వ్యాపారు లను అప్రమత్తం చేశారు. ప్రజావేదిక నుంచి ఫోన్ కాల్స్ రావు ఎమ్మెల్యే వెనిగండ్ల తమ ప్రజావేదిక కార్యాలయ సిబ్బంది పేర్లను ఉపయోగించి కొందరు సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజావేదిక నుంచి ఎవరికి ఎటువంటి కాల్స్ రావని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, బిల్లులు అంటూ ఎవరైన కాల్స్ చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు 1930ను సంప్రదించాలని, ప్రజావేదిక కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు.

*సైబర్ పంజా…కల్యాణ మండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యం*

*భారీ స్థాయిలో ఎగ్జిబిషన్లు ఉన్నాయని ఎర*

*అడ్వాన్స్ పంపిస్తున్నానంటూ కమీషన్ కోసం బేరాలు*

*ఫోన్ పే ద్వారా నగదు వేయించుకుని పలువురికి కుచ్చుటోపీ…*

*ఎమ్మెల్యేల పీఏల పేర్లు ఉపయోగించుకొని మోసం*

*గత మూడు రోజులుగా జిల్లాలో సాగుతున్న సైబర్ దందా వెలుగులోకి..*

*నాకు జైలు కొత్త కాదు… ఏం చేస్తారో చేసుకోండి అంటూ సవాల్*

గుడివాడ: సైబర్ నేరగాళ్లు పందామార్చారు. కల్యాణమండపాలు, క్యాటరింగ్ ఏజెన్సీలే లక్ష్యంగా మోసాలకు పథక రచన చేశారు. భారీ స్థాయిలో ఫక్షన్లు ఉన్నాయని, కల్యాణ మండపం అద్దెకు కావాలని, క్యాటరింగ్ కాంట్రాక్టు ఇప్పిస్తామని, అడ్వాన్గా నగదు చెల్లిస్తున్నాం అంటూ వారి వద్ద నుంచి కమీషన్ల రూపంలో భారీగా నగదు కొట్టేశారు.

గత మూడు రోజులుగా సాగుతున్న ఈ దందా శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… స్థానిక సత్యనారాయణపురంలోని ఐ.ఎం.ఏ.హాల్లో బెనారస్ చీరల భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందంటూ గుడివాడ ఎమ్మెల్యే పీఏ శశి చెప్పినట్లు హాల్ మేనేజరు శరత్కుమార్ అనే వ్యక్తి 9398053148 నంబర్ నుంచి ఫోన్ చేశాడు. అతని వద్ద పట్టణంలోని ఇద్దరు ప్రముఖ క్యాటరింగ్ ఏజెన్సీల వివరాలను సేకరించాడు. వారిని ఫోన్లో సంప్రదించాడు. తొలుత రోజుకు 500 మందికి భోజనాలు (వెజ్, నాన్వెజ్), స్నాక్స్ ఏర్పాటు చేయాలని,ఎంతమొత్తం అవుతుందంటూ ఆరా తీశాడు. వారితో సంప్రదించే సమయంలో కల్యాణ మండపం మేనేజర్ , పీఏ శశి పేర్లను వాడుకున్నాడు.

అడ్వాన్స్ చెల్లిస్తానంటూ నమ్మకంగా మాట్లాడి వారిని బుట్టలో వేసుకున్నాడు. వారి ఫోన్పే నెంబర్లు తీసుకుని తొలుత వారికి రూ.1 పంపించాడు. దీంతో పాటు రూ.1.50 లక్షలు నగదును చేతిలో పట్టుకున్న ఫొటోను వారికి వాట్సప్ కు పంపించాడు. ఆ తర్వాత తిరిగి వారికి ఫోన్ చేసి జీఎస్టి సమస్య అడ్డుగా వస్తోందంటూ మాటల్లో పెట్టి, తాను కాంట్రాక్టును ఇప్పిస్తానని, తనకు రావలసిన కమీషన్ ను వెంటనే పంపాలని, అడ్వాన్స్ నగదును వెంటనే మీ ఖాతాలోకి జమచేస్తానని నమ్మించాడు.

దీంతో వారు విడతల వారీగా నగదును సైబర్ నేరగాడు సూచించిన ఫోన్పే నెంబర్లకు బదిలీ చేశారు. లక్షలాది రూపాయలు వేరు వేరు ఖాతాల్లోకి జమ అయ్యాయి.తప్పించుకున్న ఇద్దరు క్యాటరింగ్ నిర్వాహకులు గుడ్లవల్లేరుకు చెందిన క్యాటరింగ్ నిర్వాహకుడికి ఫోన్ చేసి యథావిథిగా కథను చెప్పి నమ్మబ లికేందుకు విశ్వప్రయత్నం చేశాడు.

తనకు కమీషన్ నగదు చెల్లిస్తే రూ.1.50లక్షలు అడ్వాన్స్ నగదును పంపిస్తానంటూ, డబ్బుల కట్టల ఫొటోను పంపించాడు. రెండో శనివారం బ్యాంకులకు శెలవు కావడంతో ఆయనకు అనుమానం వచ్చి నగదు చెల్లించేందుకు నిరాకరించాడు. దీంతో సైబర్ నేరం బారిన పడకుండా తప్పించుకు న్నాడు.

కైకలూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలంటు సీఎన్ఆర్ గార్డెన్స్ అనువుగా ఉంటుందంటూ కైకలూరు ఎమ్మెల్యే పీఏ ధనుంజయ్ తమకు చెప్పినట్లు నమ్మించి కల్యాణ మండపం మేనేజరుకు ఫోన్ చేశాడు. కైకలూరులో క్యాటరింగ్ ఎవరు బాగా చేస్తారంటూ ఆరా తీశాడు. కైకలూరులోని ఓ క్యాటరింగ్ నిర్వాహకుడిని సంప్రదించి యథావిథిగా కథను చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు.

దీంతో జాక్పాట్ తగిలిందంటూ సదరు క్యాటరింగ్ నిర్వాహకుడు వెంటనే తన సమీప బంధువు, గుడ్లవల్లేరుకు చెందిన క్యాటరింగ్ నిర్వాహకుడికి ఫోన్ చేసి భోజనం ప్లేటుకు ఎంత తీసుకోవాలో అని సంప్రదించాడు దీంతో విషయం అర్థం చేసుకున్న సదరు క్యాటరింగ్ నిర్వాహకుడు నాకు కూడా ఇటువంటి ఫోన్ కాల్ వచ్చిందని, ఇదంతా మోసం అంటూ వివరించాడు. దీంతో కైకలూరు క్యాటరింగ్ నిర్వాహకుడు కాంట్రాక్టు ఇప్పిస్తానని నమ్మించిన వ్యక్తికి ఫోన్ చేసి నేరుగా కలుస్తానని చెప్పాడు. తాను గుడివాడలో ఉన్నట్లు సైబర్ నేరగాడు శరత్కుమార్ చెప్పడంతో తాను కూడా గుడివాడలో ఉన్నానని, నేరుగా కలిసేందుకు వస్తున్నానంటూ ఫోన్లో తెలిపాడు. దీంతో శరత్ కుమార్ ఫోన్ చేయడం, లిఫ్ట్ చేయడం మానేశాడు. కాగా, సైబర్ మోస గాడి వలో చిక్కి ఎంతమంది నగదు పోగొట్టుకు న్నారో తెలియాల్సి ఉంది.

*నాకు జైలు కొత్త కాదంటూ బెదిరింపులు…*

విషయం తెలుసుకున్న శశి.. ఆ వ్యక్తికి కాల్ చేసి ఇదేంటని ప్రశ్నించారు. వెంటనే రూ.25 వేలు పంపితే మీ నియోజకవర్గంలో ఈ ఫోన్ కాల్స్ ఆగు తాయి, లేదంటే చేతనైంది చేసుకో.. నాకు జైలు కొత్త కాదు అని ఆ ఆగంతుకుడు దురుసుగా సమా దానం చెప్పాడు. దీంతో ఈ వ్యవహారంపై గుడివాడ ఎమ్మెల్యే కార్యాలయ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రజలను, వ్యాపారు లను అప్రమత్తం చేశారు.

ప్రజావేదిక నుంచి ఫోన్ కాల్స్ రావు
ఎమ్మెల్యే వెనిగండ్ల

తమ ప్రజావేదిక కార్యాలయ సిబ్బంది పేర్లను ఉపయోగించి కొందరు సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజావేదిక నుంచి ఎవరికి ఎటువంటి కాల్స్ రావని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, బిల్లులు అంటూ ఎవరైన కాల్స్ చేస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు 1930ను సంప్రదించాలని, ప్రజావేదిక కార్యాలయం దృష్టికి తీసుకురావాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.