భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమంలో భాగంగా చిట్వేల్ మండల కార్యాలయంలో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్ల (BLAలు) సమావేశం జరిగింది. తహసీల్దార్ ఎస్.వి. నరసింహారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయడం, మరణించిన వారి పేర్లు, ద్వంద్వ నమోదులను తొలగించడం, చిరునామా మార్పులు నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా చురుకుగా సహకరించాలని కోరారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, సవరణల స్వీకరణలో ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు.



