Saturday, 13 June 2026
  • Home  
  • అన్నారంలో ఘోరం… తాగుడు మానుకోమన్నం దుకు తల్లి ఆత్మహత్య కాదు..!!! కొడుకే కడతేర్చాడు?
- కామారెడ్డి

అన్నారంలో ఘోరం… తాగుడు మానుకోమన్నం దుకు తల్లి ఆత్మహత్య కాదు..!!! కొడుకే కడతేర్చాడు?

‌• ఉరివేసుకుని చనిపోయిందంటూ అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల చకచకా ఏర్పాట్లు! • ​సరిగ్గా పాడె కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. శ్మశానంలో అడ్డుకున్న వైనం! • ​కష్టపడే తల్లిపై కక్షగట్టి ప్రాణం తీశాడంటూ గ్రామస్తుల బహిరంగ ఆరోపణ.. రామారెడ్డి మండలంలో తీవ్ర సంచలనం?? కామారెడ్డి 13 జూన్ ( పున్నమి ప్రతినిధి ) :: రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో శుక్రవా రం తెల్లవారుజామున ఒక ఘోర కలియుగ విపరీ తం వెలుగుచూసింది. కన్నతల్లి మద్యం తాగు తోందనే నెపంతో ఒక కొడుకు ఆమెపై కక్షగట్టి కడతేర్చాడంటూ గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలు ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో తీవ్ర సంచలనం రేపు తున్నాయి. కుటుంబ సభ్యులు దీనిని ఆత్మహత్య గా చిత్రీకరించి, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రి యలు ముగించేందుకు ప్రయత్నించగా.. చివరి నిమిషంలో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకో వడం స్థానికంగా కలకలం రేపింది. కూలి పనులకు వెళ్తూ.. మద్యానికి బానిసైన తల్లి వివరాల్లోకి వెళ్తే… అన్నారం గ్రామానికి చెందిన అల్లపు లక్ష్మి (44, భర్త కీ.శే. రాములు,ఒడ్డెర కులం) రోజువారీగా కష్టాన్ని నమ్ముకుని జీవించేది. ఎక్కడ కూలి పని దొరికితే అక్కడికి వెళ్లి, కష్టపడి పనులు ముగించు కొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మద్యం సేవి స్తూ ఉండేదని గ్రామస్తులు తెలిపారు. గత కొంత కాలంగా ఆమె విపరీతంగా మద్యానికి బానిస కావడంతో.. ఈ విషయమై కూతురు సూర శిరీష కుమారుడు రాము పలుమార్లు ఆమెను మందలిం చారు. కుటుంబ సభ్యుల కథనం….తాగుడు మానుకోమన్నందుకు ఉరివేసు కుంది.కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం.. శుక్రవారం (12-06-2026) ఉదయం కొడుకు రాముకు, తల్లి లక్ష్మికి మధ్య తాగుడు విషయమై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ముట్టకూడదని రాము తల్లిని గట్టిగా హెచ్చరించాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి, ఉదయం 07:18 గంటల ప్రాంతంలో తన కుమార్తె శిరీషకు ఫోన్ చేసి, తమ్ముడు నన్ను ఖచ్చితంగా మందు తాగొద్దని హెచ్చరించాడు, నాకు ఉండబుద్ధి కావడం లేదు.. నేను ఉరివేసుకు ని చనిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కంగారుపడిన కుమార్తె శిరీష వెంటనే తమ్ముడు రాముకు ఫోన్ చేసి విషయం చెప్పింది. రాము ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా, లోపల నుంచి తలుపులు పెట్టి ఉన్నాయి. ఇంటి ముందు ఉండే దోనాడు సంతోష్‌ తో కలిసి కిటికీలోంచి చూడగా, లక్ష్మి అప్పటికే చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు తలుపులు బద్దలు గొట్టి, కొడవలితో చీరను కోసి కిందకు దించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్తు ల సంచలన ఆరోపణలు ఆత్మహత్య కాదు..కొడుకే కడతేర్చాడు!’అయితే ఈ కథనాన్ని అన్నారం గ్రామస్తులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. లక్ష్మి ఆత్మహత్య చేసుకోలేదని, కన్నకొడుకే ఆమెపై కక్షగట్టి దారుణంగా కడతేర్చాడని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. హత్య ఉదంతం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే.. కుటుంబ సభ్యులు కొందరు వ్యక్తుల సహాయంతో ఎవరికీ తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారని స్థానికులు చెప్తున్నారు.శ్మశానంలో ప్రత్యక్ష మైన పోలీసులు.. శవం స్వాధీనం! ​శుక్రవారం ఉదయం లక్ష్మి శవానికి అంత్యక్రియలు చేయబో యే తరుణంలో, గ్రామం నుంచి అందిన రహస్య సమాచారంతో రామారెడ్డి పోలీసులు రంగంలోకి దిగారు. అంత్యక్రియలను మధ్యలోనే అడ్డుకొని, లక్ష్మి శవాన్ని తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వ హించి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి మృతురాలి కుమార్తె సూర శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు జరుపుతున్నా రు. అయితే, ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలి యాలంటే సంబంధిత ఉన్నతాధికారులు పూర్వా పరాలపై గ్రామంలో నిక్కచ్చితంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న కొడుకుపై కఠినమైన శిక్ష విధించాలంటూ అన్నారం గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు జరిపే పోస్టుమార్టం నివేదిక, పూర్తి స్థాయి విచార ణలోనే అసలు నిజాలు బయటపడాల్సి ఉంది.

‌• ఉరివేసుకుని చనిపోయిందంటూ అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల చకచకా ఏర్పాట్లు!

• ​సరిగ్గా పాడె కట్టే సమయానికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. శ్మశానంలో అడ్డుకున్న వైనం!

• ​కష్టపడే తల్లిపై కక్షగట్టి ప్రాణం తీశాడంటూ గ్రామస్తుల బహిరంగ ఆరోపణ.. రామారెడ్డి మండలంలో తీవ్ర సంచలనం??

కామారెడ్డి 13 జూన్ ( పున్నమి ప్రతినిధి ) ::

రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో శుక్రవా రం తెల్లవారుజామున ఒక ఘోర కలియుగ విపరీ తం వెలుగుచూసింది. కన్నతల్లి మద్యం తాగు తోందనే నెపంతో ఒక కొడుకు ఆమెపై కక్షగట్టి కడతేర్చాడంటూ గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలు ఉమ్మడి కామారెడ్డి జిల్లాలో తీవ్ర సంచలనం రేపు తున్నాయి. కుటుంబ సభ్యులు దీనిని ఆత్మహత్య గా చిత్రీకరించి, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రి యలు ముగించేందుకు ప్రయత్నించగా.. చివరి నిమిషంలో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకో వడం స్థానికంగా కలకలం రేపింది. కూలి పనులకు వెళ్తూ.. మద్యానికి బానిసైన తల్లి వివరాల్లోకి వెళ్తే… అన్నారం గ్రామానికి చెందిన అల్లపు లక్ష్మి (44, భర్త కీ.శే. రాములు,ఒడ్డెర కులం) రోజువారీగా కష్టాన్ని నమ్ముకుని జీవించేది. ఎక్కడ కూలి పని దొరికితే అక్కడికి వెళ్లి, కష్టపడి పనులు ముగించు కొని ఇంటికి వచ్చిన తర్వాత ఆమె మద్యం సేవి స్తూ ఉండేదని గ్రామస్తులు తెలిపారు. గత కొంత కాలంగా ఆమె విపరీతంగా మద్యానికి బానిస కావడంతో.. ఈ విషయమై కూతురు సూర శిరీష కుమారుడు రాము పలుమార్లు ఆమెను మందలిం చారు. కుటుంబ సభ్యుల కథనం….తాగుడు మానుకోమన్నందుకు ఉరివేసు కుంది.కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం.. శుక్రవారం (12-06-2026) ఉదయం కొడుకు రాముకు, తల్లి లక్ష్మికి మధ్య తాగుడు విషయమై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ముట్టకూడదని రాము తల్లిని గట్టిగా హెచ్చరించాడు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి, ఉదయం 07:18 గంటల ప్రాంతంలో తన కుమార్తె శిరీషకు ఫోన్ చేసి, తమ్ముడు నన్ను ఖచ్చితంగా మందు తాగొద్దని హెచ్చరించాడు, నాకు ఉండబుద్ధి కావడం లేదు.. నేను ఉరివేసుకు ని చనిపోతున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కంగారుపడిన కుమార్తె శిరీష వెంటనే తమ్ముడు రాముకు ఫోన్ చేసి విషయం చెప్పింది. రాము ఆందోళనతో ఇంటికి వెళ్లి చూడగా, లోపల నుంచి తలుపులు పెట్టి ఉన్నాయి. ఇంటి ముందు ఉండే దోనాడు సంతోష్‌ తో కలిసి కిటికీలోంచి చూడగా, లక్ష్మి అప్పటికే చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు తలుపులు బద్దలు గొట్టి, కొడవలితో చీరను కోసి కిందకు దించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చేసరికే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామస్తు ల సంచలన ఆరోపణలు ఆత్మహత్య కాదు..కొడుకే కడతేర్చాడు!’అయితే ఈ కథనాన్ని అన్నారం గ్రామస్తులు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. లక్ష్మి ఆత్మహత్య చేసుకోలేదని, కన్నకొడుకే ఆమెపై కక్షగట్టి దారుణంగా కడతేర్చాడని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. హత్య ఉదంతం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే.. కుటుంబ సభ్యులు కొందరు వ్యక్తుల సహాయంతో ఎవరికీ తెలీకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారని స్థానికులు చెప్తున్నారు.శ్మశానంలో ప్రత్యక్ష మైన పోలీసులు.. శవం స్వాధీనం! ​శుక్రవారం ఉదయం లక్ష్మి శవానికి అంత్యక్రియలు చేయబో యే తరుణంలో, గ్రామం నుంచి అందిన రహస్య సమాచారంతో రామారెడ్డి పోలీసులు రంగంలోకి దిగారు. అంత్యక్రియలను మధ్యలోనే అడ్డుకొని, లక్ష్మి శవాన్ని తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వ హించి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి మృతురాలి కుమార్తె సూర శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకునిదర్యాప్తు జరుపుతున్నా రు. అయితే, ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలి యాలంటే సంబంధిత ఉన్నతాధికారులు పూర్వా పరాలపై గ్రామంలో నిక్కచ్చితంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న కొడుకుపై కఠినమైన శిక్ష విధించాలంటూ అన్నారం గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు జరిపే పోస్టుమార్టం నివేదిక, పూర్తి స్థాయి విచార ణలోనే అసలు నిజాలు బయటపడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.