ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 10: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీడీవో జలజాక్షి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి సమక్షంలో గ్రామస్థాయి అధికారులకు గ్రామ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ నిర్వహించారు. గ్రామ అవసరాలను గుర్తించి ముందుగానే అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు, వ్యయ వివరాలను ప్రణాళికలో పొందుపరచాలని తెలిపారు. గ్రామాల పురోగతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వెలుగు వీవోఏలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామ అభివృద్ధి ప్రణాళికపై అధికారులకు శిక్షణ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 10: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీడీవో జలజాక్షి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ, ఉపాధ్యక్షుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి సమక్షంలో గ్రామస్థాయి అధికారులకు గ్రామ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ నిర్వహించారు. గ్రామ అవసరాలను గుర్తించి ముందుగానే అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు, వ్యయ వివరాలను ప్రణాళికలో పొందుపరచాలని తెలిపారు. గ్రామాల పురోగతికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వెలుగు వీవోఏలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

