Wednesday, 10 June 2026
  • Home  
  • ఉక్కు కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి- తలపా దామోదరం
- తిరుపతి

ఉక్కు కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేయాలి- తలపా దామోదరం

శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో బుధవారం నిర్వహించిన సంతాప కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, మరుగుతున్న ద్రవరూప ఉక్కు కార్మికులపై పడటంతో పలువురు కార్మికులు సజీవదహనం కావడం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి అధికారులతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని కోరారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, బాధిత కుటుంబంలోని ఒకరికి ఉద్యోగావకాశం కల్పించి, తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు నివాళులర్పించి, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంటోనీ, పార్టీ నాయకులు శంకర్, గిరీష్, దిలీప్, అరుణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.