శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఎం. ఉమేష్రావు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. గత పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, పరిపాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రానుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నాయని ఆరోపించిన ఆయన, ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రగతి, ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్లపాలెం పీఏసీఎస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, చిల్లకూరు మణి, గంగనపల్లి రమేష్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి-ఉమేష్రావు