Wednesday, 10 June 2026
  • Home  
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలసి వెంకన్నను దర్శించుకున్న బీజేపీ నేత కోలా
- తిరుపతి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో కలసి వెంకన్నను దర్శించుకున్న బీజేపీ నేత కోలా

శ్రీకాళహస్తి, జూన్ 10, (పున్నమి న్యూస్) : తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర నాయకులు పి.వి.ఎన్. మాధవ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఇతర బీజేపీ మరియు ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించుకున్న అనంతరం వారు శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయం వెలుపల కోలా ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలు అనుభవించేలా చల్లగా చూడాలని ఆ శ్రీనివాసుడిని ప్రార్థించినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను అధికారులు కట్టుదిట్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.