తిరుపతి జిల్లా రైల్వేకోడూరు మండలం కే.బుడుగుంటపల్లిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టిడిపి ఇన్‌చార్జి, ఏపీఎండీసీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరై భూహక్కుదారులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, గతంలో రాజకీయ నాయకుల ఫొటోలతో పాస్‌బుక్కులు జారీ చేసేవారని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ రాజముద్రతో పాస్‌బుక్కులు అందజేస్తోందన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రెవెన్యూ సేవలను పారదర్శకంగా ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమానికి తహసీల్దార్ కోనేటి అమర్‌నాథ్ అధ్యక్షత వహించగా, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకులు స్పష్టం చేశారు.



