Wednesday, 10 June 2026
  • Home  
  • గిరిజనుల అభ్యున్నతికి బొజ్జల కుటుంబం అండ-బృందమ్మ
- తిరుపతి

గిరిజనుల అభ్యున్నతికి బొజ్జల కుటుంబం అండ-బృందమ్మ

శ్రీకాళహస్తి, జూన్ 09, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సేవలందిస్తున్న బొజ్జల కుటుంబానికి గిరిజనులు అత్యంత ఆప్తులు, ఆత్మీయులని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పట్టణంలోని 18వ వార్డు కొత్త కోనేరు ఎస్టీ కాలనీలో గిరిజన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సలహా మండలి సభ్యుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బయ్య సహకారంతో బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ….సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బొజ్జల కుటుంబం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి తమ కుటుంబం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.