ఖమ్మం, జూన్
(పున్నమి జిల్లా ప్రతి నిధి )
:ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లాకు అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తున్న కీలక నిందితుడు దేవేందర్ (35)ను చింతకాని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. జూన్ 5న అక్రమ ఇసుక టిప్పర్ ఢీకొనడంతో చింతకాని మండలానికి చెందిన మాతంగి నాగరాజు మృతి చెందిన ఘటనపై దర్యాప్తులో దేవేందర్ ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుక విధానాన్ని దుర్వినియోగం చేస్తూ తెలంగాణకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. వైరా డివిజన్‌లో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.



