Saturday, 6 June 2026
  • Home  
  • చిట్వేల్ తహసీల్దార్‌గా నరసింహారావు బాధ్యతల స్వీకరణ
- తిరుపతి

చిట్వేల్ తహసీల్దార్‌గా నరసింహారావు బాధ్యతల స్వీకరణ

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేల్ మండల తహసీల్దార్‌గా నరసింహారావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై చిట్వేల్‌కు వచ్చారు. ఇంతకుముందు చిట్వేల్‌లో పనిచేసిన తహసీల్దార్ స్పందన తిరుపతి జిల్లా కేవీబీ పురానికి బదిలీ కావడంతో ఆ స్థానంలో నరసింహారావు నియమితులయ్యారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పెన్షన్ల మంజూరు, భూ సమస్యల పరిష్కారం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ వంటి సేవలను ప్రజలకు సులభతరం చేయడమే తన ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి తోడ్పడతామని నరసింహారావు వెల్లడించారు.

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని చిట్వేల్ మండల తహసీల్దార్‌గా నరసింహారావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై చిట్వేల్‌కు వచ్చారు. ఇంతకుముందు చిట్వేల్‌లో పనిచేసిన తహసీల్దార్ స్పందన తిరుపతి జిల్లా కేవీబీ పురానికి బదిలీ కావడంతో ఆ స్థానంలో నరసింహారావు నియమితులయ్యారు.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా రెవెన్యూ సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
పెన్షన్ల మంజూరు, భూ సమస్యల పరిష్కారం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ వంటి సేవలను ప్రజలకు సులభతరం చేయడమే తన ప్రాధాన్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి తోడ్పడతామని నరసింహారావు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.