నెల్లూరు జిల్లా నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థాన నూతన వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈఓ శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తలు పచ్చవ వెంగయ్య, వెంకటేశ్వర్లు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా నేత మేకపాటి మాలాద్రి నాయుడు ముసలయ్యను సత్కరించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ధర్మకర్తకు శుభాకాంక్షలు తెలిపారు.

నెల్లూరు : నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రధాన ధర్మకర్తగా వేమూరి ముసలయ్య!