Thursday, 4 June 2026
  • Home  
  • ఏపీ సీడ్స్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల
- తిరుపతి

ఏపీ సీడ్స్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల

శ్రీ కాళహస్తి, జూన్ 04, (పున్నమి న్యూస్) : ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అభివృద్ధి, బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేయడాన్ని ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ కమిటీ (TUCC) నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా నాయకులు జె.వి. నరసింహామూర్తి, తాలేటి రామచంద్రయ్య మాట్లాడుతూ….1972లో స్థాపించబడిన ఏపీ సీడ్స్ సంస్థ ఒకప్పుడు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. అనంతరం ప్రైవేటు విత్తన కంపెనీల పోటీ, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం TUCC బృందం పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు, అధికారులను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సంస్థ పునరుద్ధరణకు రూ.150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే శ్రీకాళహస్తి యూనిట్‌లో విత్తన ఉత్పత్తి విస్తరణకు కూడా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కార్మికుల జీవనోపాధి పరిరక్షణకు సహకరించిన మంత్రి అచ్చన్నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి TUCC నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.