Thursday, 4 June 2026
  • Home  
  • రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో పక్కకు దూసుకెళ్లిన ఆటో*
- ఖమ్మం

రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో పక్కకు దూసుకెళ్లిన ఆటో*

*రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో పక్కకు దూసుకెళ్లిన ఆటో* *రాత్రి వేళ ప్రమాదం – తప్పిన పెను ముప్పు* *పశువుల యజమానుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 04 గుగులోత్ భావుసింగ్ నాయక్ *ఏన్కూరు* మండల కేంద్రంలో జన్నారం X రోడ్డు సమీపంలో రాత్రి వేళ రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో ఓ ఆటో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, పెను ప్రమాదం తప్పింది. ఏన్కూర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా గేదెలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయి డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటో వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు చేరుకొని ఆటోలోని వారిని సురక్షితంగా బయటకు తీసి ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది ఆటో మాత్రం పాక్షికంగా ధ్వంసమైంది.

*రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో పక్కకు దూసుకెళ్లిన ఆటో*

*రాత్రి వేళ ప్రమాదం – తప్పిన పెను ముప్పు*

*పశువుల యజమానుల నిర్లక్ష్యంపై వాహనదారుల ఆగ్రహం*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి మే 04
గుగులోత్ భావుసింగ్ నాయక్

*ఏన్కూరు*

మండల కేంద్రంలో జన్నారం X రోడ్డు సమీపంలో రాత్రి వేళ రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో ఓ ఆటో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలవగా, పెను ప్రమాదం తప్పింది.
ఏన్కూర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఆటోకు అకస్మాత్తుగా గేదెలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయి డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
ఆటోలో ఉన్న డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటో వేగం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు చేరుకొని ఆటోలోని వారిని సురక్షితంగా బయటకు తీసి ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది
ఆటో మాత్రం పాక్షికంగా ధ్వంసమైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.