క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
ఖమ్మం గ్యాస్ట్రో డాక్టర్ శెట్టిపల్లి నాగేశ్వరరావు.
ఏన్కూరు:
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఖమ్మం డాక్టర్ జీవనకోస వ్యాధి ప్రముఖ వైద్యులు డాక్టర్ శెట్టిపల్లి నాగేశ్వరావు అన్నారు. స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన తరుణ్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువకులు చదువుతోపాటు క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. వైరా ఎమ్మెల్యే తనయుడు విగ్నేష్ నాయక్ టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోతు లచ్చిరాం నాయక్, మాజీ ఎంపీటీసీ మేడ ధర్మారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యాలాలు నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల నాగేశ్వరరావు, నాయకులు దళపతి భువనేశ్వర్ రాజు, ఒక్కంతుల సాగర్, మొగిలి నాగరాజు, నన్నే ఖాన్, తంబళ్ల రవి, చిన్న స్వామి,సామేలు, పంతగాని నరేష్, టోర్నమెంట్ సభ్యులు నారాయణ దాసు నరసింహారావు, కూరాకుల రమేష్, రత్నాకరం వంశీ, వారణాసి పవన్ తదితరులు పాల్గొన్నారు.


