Tuesday, 2 June 2026
  • Home  
  • మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శ, ఆర్థిక సాయం
- తిరుపతి

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శ, ఆర్థిక సాయం

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిగ హరిజనవాడకు చెందిన టైటేషన్, అదే గ్రామానికి చెందిన చెంగమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేడు ఆ గ్రామాన్ని సందర్శించి, వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తీవ్ర శోకంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి ₹10,000 చొప్పున మొత్తం ₹20,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంగిరెడ్డి, పగలు రవీంద్రారెడ్డి, ఆక్స్ఫర్డ్ మధుసూదన్ రెడ్డి, బాబు, శేఖర్ రెడ్డి, పగల సురేష్ రెడ్డి, జగ్గయ్య, భాస్కర్, నరసింహులు, నాదముని, కడివేటి రామచంద్రయ్య, చిరంజీవి, దేవా, శంకరయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.