మహా నగరంలో మంచినీటి కొరత… ?
పున్నమి న్యూస్
02 జూన్ 2026
తెలంగాణ ఇంచార్జి
హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ 300 నుంచి 500 వరకు బోర్లు నీరు కోల్పోయి ఎండిపోతున్నాయని భూగర్భ శాస్త్రవేత్తల నివేదికలు చెబుతున్నాయి.
మహానగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు, నీటి రిజర్వాయర్లను కాపాడుకుంటేనే భవిష్యత్ కు భద్రత, లేకుంటే బిందె నీటి కోసం అవస్థలు తప్పవు.
బహుళ అంతస్తుల భవనాలు (Apartments), గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలలో నీటి అవసరాల కోసం బోరు బావులపైనే ఆధార పడుతున్నారు.
నగర విస్తరణ, రహదారులు, ఓపెన్ స్థలాలు కాంక్రీట్ మయం కావడంతో వర్షం నీరు భూమిలో ఇంకే అవకాశం లేదు. కావున,భూగర్భ జలాలు రీఛార్జ్ అవ్వడం లేదు.
అనుమతులు లేకుండా వేలాది కొత్త బోర్లు 1000 నుండి 1200 అడుగుల వరకు తవ్వేస్తుండటంతో భూమి నీటి పొరలు ఎండిపోతున్నాయి.
ఈ విపత్కర పరిస్థితిపై ఎంతమంది నాయకులు మాట్లాడుతున్నారు…?
ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇస్తారు, సభల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తారు.
కానీ, భవిష్యత్ తరాలకు జీవనాధారమైన తాగు నీటి సంరక్షణ గురించి పట్టించుకుంటున్నారా…?



