Sunday, 31 May 2026
  • Home  
  • ఆత్మరక్షణే లక్ష్యం.. కిక్ బాక్సింగ్ క్యాంప్‌లో విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన ఈతలపాక సుజాత
- News

ఆత్మరక్షణే లక్ష్యం.. కిక్ బాక్సింగ్ క్యాంప్‌లో విద్యార్థులకు ప్రోత్సాహం అందించిన ఈతలపాక సుజాత

ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 31 యువతరం న్యూస్ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను అలవర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఈతలపాక సుజాత సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ వార్డు పరిధిలో గల కంచరపాలెం ఆర్‌పీవేట ఉన్నత పాఠశాలలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు, జోనల్ కమిషనర్ హైమావతి పర్యవేక్షణలో అల్ ఇండియా ఎన్షియంట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరియు టైగర్ కిక్ బాక్సింగ్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మాస్టర్ గుండి జానకి రామ్ నేతృత్వంలో ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్యాంప్‌ను సందర్శించిన ఈతలపాక సుజాత, కిక్ బాక్సింగ్ శిక్షణ పొందుతున్న చిన్నారులకు తన సొంత నిధులతో పాలు ప్యాకెట్లు, చాక్లెట్ క్రీమ్ కేకులు, ఉడికించిన కోడిగుడ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసాన్ని పరిశీలించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు కిక్ బాక్సింగ్, కరాటే వంటి ఆత్మరక్షణ క్రీడలను తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చి తమ కుటుంబానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 56వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కార్తీక్ యాదవ్, బి. శ్రీకాంత్, కె. కోటేశ్వరరావు, కోచ్ గుండి జానకి రామ్, అసిస్టెంట్ కోచ్ బి. భరత్ తదితరులు పాల్గొన్నారు. “క్రీడలతో శక్తి.. ఆత్మరక్షణతో భద్రత.. విద్యార్థుల అభివృద్ధికి సుజాత చేయూత” అంటూ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది.

ఉత్తరాంధ్ర ప్రతినిధి మే 31 యువతరం న్యూస్

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను అలవర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్‌ను రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఈతలపాక సుజాత సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు.
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 56వ వార్డు పరిధిలో గల కంచరపాలెం ఆర్‌పీవేట ఉన్నత పాఠశాలలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు, జోనల్ కమిషనర్ హైమావతి పర్యవేక్షణలో అల్ ఇండియా ఎన్షియంట్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరియు టైగర్ కిక్ బాక్సింగ్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ మాస్టర్ గుండి జానకి రామ్ నేతృత్వంలో ఉచిత కిక్ బాక్సింగ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా క్యాంప్‌ను సందర్శించిన ఈతలపాక సుజాత, కిక్ బాక్సింగ్ శిక్షణ పొందుతున్న చిన్నారులకు తన సొంత నిధులతో పాలు ప్యాకెట్లు, చాక్లెట్ క్రీమ్ కేకులు, ఉడికించిన కోడిగుడ్లు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసాన్ని పరిశీలించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు కిక్ బాక్సింగ్, కరాటే వంటి ఆత్మరక్షణ క్రీడలను తప్పనిసరిగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చి తమ కుటుంబానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు ఆమె ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో 56వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కార్తీక్ యాదవ్, బి. శ్రీకాంత్, కె. కోటేశ్వరరావు, కోచ్ గుండి జానకి రామ్, అసిస్టెంట్ కోచ్ బి. భరత్ తదితరులు పాల్గొన్నారు.
“క్రీడలతో శక్తి.. ఆత్మరక్షణతో భద్రత.. విద్యార్థుల అభివృద్ధికి సుజాత చేయూత” అంటూ కార్యక్రమం ప్రశంసలు అందుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.