Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

విదేశీయుల వివరాల నమోదుపై హోటళ్లకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు 24 గంటల్లో ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోద

Punnami Newsroom Published:
విదేశీయుల వివరాల నమోదుపై హోటళ్లకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు 24 గంటల్లో ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోద

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం నగర పరిధిలోని హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు, హాస్టళ్లు, హోమ్‌స్టేలు, పేయింగ్ గెస్ట్ వసతి గృహాల నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ డా. శంకబ్రత బాగ్చి ఐపీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తమ వసతి గృహాల్లో బస చేసే విదేశీ పౌరులు, ఓసీఐ (OCI) కార్డుదారుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

విదేశీ పౌరులు వసతి గృహానికి చేరుకున్న 24 గంటల్లోపు వారి రాక వివరాలను, తిరిగి వెళ్లిపోయిన 24 గంటల్లోపు నిష్క్రమణ వివరాలను ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు. ఇప్పటివరకు సంబంధిత పోర్టల్ లాగిన్ వివరాలు పొందని సంస్థలు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం-2025 ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు.

విదేశీ పౌరుల కదలికల పర్యవేక్షణ, ఇమ్మిగ్రేషన్ నిబంధనల అమలు, జాతీయ భద్రత దృష్ట్యా నగరంలోని అన్ని వసతి గృహాల నిర్వాహకులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

విదేశీయుల వివరాల నమోదుపై హోటళ్లకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు 24 గంటల్లో ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోద

విదేశీయుల వివరాల నమోదుపై హోటళ్లకు పోలీస్ కమిషనర్ ఆదేశాలు 24 గంటల్లో ఫారమ్-III ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోద

Leave a comment

Your email address will not be published. Required fields are marked *