యాదాద్రి భువనగిరి జిల్లా
మే 31 ఆదివారం
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా అన్నారు, ఆదివారం రోజున టీ జె ఏ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు.
ఇప్పటివరకు జిల్లా లో ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం చాలా దారుణమని అన్నారు.
జిల్లా కేంద్రం మరియు వివిధ మండల జర్నలిస్టుల సమస్యలను వివరించడానికి ఒక వేదిక లేకపోవడం వల్ల జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే,అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న జిల్లా ఉపాధ్యక్షులు ఖదీర్,రెహమాన్,జిల్లా ప్రచార కార్యదర్శి సిరిల్,సభ్యులు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.


