ఎర్పేడు, మే 30, (పున్నమి న్యూస్) : ఎర్పేడు మండలం పాతవీరపురం గ్రామంలో వైభవంగా జరుగుతున్న శ్రీ ద్రౌపదీ దేవి తిరునాళ్ల మహోత్సవాల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు టీడీపీ మండల అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు, నాయకుడు బత్తల గిరి నాయుడు, గ్రామ పెద్దలు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన ఆయన ఉత్సవాల విజయవంత నిర్వహణకు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశాంతత, ఆనందాన్ని కలిగిస్తాయని అన్నారు. పాతవీరపురం గ్రామ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక ఉత్సవాలు సామాజిక ఐక్యతకు దోహదం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి