తొట్టంబేడు, మే 30, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండల రైతులకు సోమవారం నుంచి యూరియా అందుబాటులోకి రానుందని తంగేళ్లపాలెం సింగల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు వేగవంతం కావడంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన మేర యూరియా నిల్వలను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు సకాలంలో యూరియాను తీసుకెళ్లి పంటలకు వినియోగించుకోవాలని సూచించారు. ఎరువుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. యూరియా పొందదలచిన రైతులు తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డుతో బ్యాంకును సంప్రదించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు అందజేస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని భాస్కర్ ముదిరాజ్ హెచ్చరించారు.

ఖరీఫ్ రైతులకు శుభవార్త.. నేటి నుంచి యూరియా పంపిణీ