తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 29 :
ప్రాణదాతలుగా మారండి.. మానవత సంస్థ పిలుపు
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన తాళ్లపూడిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. రాజమండ్రి సంజీవని బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాళ్లపూడి మండలంతో పాటు కొవ్వూరు, గోపాలపురం, పోలవరం మండలాలకు చెందిన యువత, సేవాభావం కలిగిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మానవత గౌరవ చైర్మన్ సింహాద్రి జనార్ధనరావు మాట్లాడుతూ, శిబిరంలో సేకరించే రక్తానికి అనుగుణంగా భవిష్యత్తులో అవసరమైన పేషెంట్లకు బ్లడ్ కార్డులు అందజేసి, బ్లడ్ బ్యాంక్ ద్వారా కావలసిన రక్తగ్రూపును అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంస్థ స్థాపకులు ఎన్. రామచంద్రారెడ్డి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, పెమ్మాడి దుర్గాప్రసాద్, సాయన సుబ్బారావు, కొప్పాక వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

