ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందన్నారు.
టీడీపీ మహానాడులో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రం అప్పుల భారంలో కూరుకుపోయిందని, ప్రస్తుతం పెట్టుబడులు ఆకర్షిస్తూ ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. గత 23 నెలల్లో భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు.


