ప్రముఖ ఉర్దూ కవి బషీర్ బద్ర్ (91) భోపాల్‌లో కన్నుమూశారు. ఆయన ఉర్దూ సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన కవులలో ఒకరుగా గుర్తింపు పొందారు.
1999లో ఆయన రచించిన ‘ఆస్’ ఘజల్ సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పద్మశ్రీతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణంతో ఉర్దూ సాహిత్య ప్రపంచం ఒక గొప్ప కవిని కోల్పోయింది.


